హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోఆర్డినేషన్ కమిటీ నేతలు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ ధర్మతేజ మాట్లాడారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించిన తర్వాతే విశ్వవిద్యాలయాల్లో కొత్త అధ్యాపక నియామకాలు చేపట్టాలని కోరారు. అప్పటివరకు ఏడో వేతన సవరణ ప్రకారం బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ తో యూజీసీ పే సేల్ ఇవ్వాలని, సర్వీస్‌ను గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాభవన్‌లో 500 మందితో సామూహిక విజ్ఞాపనపత్రాల సమర్పణ, ఇందిరాపార్ వద్ద పెద్దఎత్తున ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ నర్సింహులు, యాదగిరి కంభంపాటి, డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ కే అవినాశ్ , డాక్టర్ ఎం కిశోర్‌కుమార్, డాక్టర్ మఖ్దుం మొహియుద్దీన్, డాక్టర్ పడాల లక్ష్మణ్, డాక్టర్ పీ రాధాకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ ఏఈఈ నియామకాలు ; 31 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా ఇటీవల ఎంపికై, ఇరిగేషన్ శాఖలోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలకు అలాటైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)లకు ఈ నెల 31 నుంచి జలసౌధలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈఎన్సీ అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 31న సివిల్, సెప్టెంబర్ 2న ఉదయం ఎలక్ట్రికల్, మధ్యాహ్నం అగ్రికల్చర్, 3న మల్టీజోన్ సివిల్ ఇంజినీర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు ఇరిగేషన్‌శాఖ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి వివరాలను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం 9502500322, 9704314566 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.