హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : వివిధ పోలీస్ విభాగాల్లో ఉ ద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమా చారం అందించింది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవా ణా, అటవీ శాఖల్లో చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుత సడలింపుతో కానిస్టేబుల్ స్థాయి పోస్టుల కోసం 32 ఏండ్ల నుంచి 34 ఏండ్ల వరకు, ఎస్సై కోసం 37ఏండ్ల వరకు సడలింపు ఇచ్చారు. వయోపరిమితి సడలింపు విషయంలో పెద్ద సంఖ్యలో యువత నుంచి విజ్ఞప్తులు అందినట్టు ఆ ఉత్తర్వుల్లో పేరొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సమ్మె అనంతరం ఈడీ ల కమిటీలో అంగీకరించిన అంశాల్లో ప్రధానమైన 8గంటల పని విధానాలు అమలుచేయకుండా.. సిబ్బంది డ్యూటీలను కుదించాలని నిర్ణయించడం దు ర్మార్గమని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు, ఈదురు వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్యూటీ 8 గంటలు దాటితే, చేసిన అధిక పని గంటలకు డబుల్ వేజెస్ ఇవ్వాలని లేబర్ చట్టం చెప్తున్నా అమలు చే యడం లేదని ఆరోపించారు. డ్యూటీకీ డ్యూటీకి మధ్య 9గంటల విశ్రాంతి ఇ వ్వాలని సర్యులర్ ఉన్నా, పట్టించుకోకుండా సిబ్బందికి సరిపడా విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు చేయిస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారని చెప్పారు.