Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో నవంబర్ చివరి నాటికి సీఎం మార్పు ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వార్తల వేళ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)కు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సిద్ధరామయ్య.. అక్కడ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యేందుకు సమయం కోరగా అందుకు అధిష్ఠానం నిరాకరించినట్లు తెలిసింది.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధరామయ్య ఈనెల 15న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులను కలిసేందుకు సమయం కోరగా.. కేంద్ర నాయకత్వం సమయం ఇవ్వడానికి నిరాకరించిందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. భేటీ అవసరం లేదంటూ సిద్ధరామయ్యకు అధిష్ఠానం స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సిద్ధరామయ్య వర్గంలోని ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్.. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. తన సోదరుడు, కొప్పల్ ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ నివాసంలో జరిగిన ఈ సమావేశం బలప్రదర్శన కోసం ఏర్పాటు చేసిందిగా ప్రచారం జరుగుతోంది. ఇక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వారం వ్యవధిలో డీకే ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ‘ఓట్ చోరీ’ అంశం విషయంలో ఆయన రాజధానిలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Bihar Elections | రేపే బీహార్ రెండో దశ పోలింగ్.. బరిలో 1,302 మంది అభ్యర్థులు
Water Tank | కూలిన 1.38 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్.. నివాసాలను ముంచెత్తిన వరద
Air Pollution | ఢిల్లీలో అత్యంత దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. నగరాన్ని కప్పేసిన పొగమంచు