ఐనవోలు/రాయపర్తి/తొర్రూరు/మహబూబ్‌నగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. గురువారం మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గోపాల్పేట మండలం మున్ననూర్‌కు చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పుష్పలత గులాబీ పార్టీలో చేరారు.
భూత్పూర్ మం డలం అన్నాసాగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో జా యిన్ అయ్యారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో నర్వ మండలం పాతర్చేడ్కు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు కారెక్కారు. తెలకపల్లి మండలం ఆలేరుకు చెందిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఆనంద్‌తోపాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పాన్‌గల్ మండలంలో మాజీ ఎమ్మెల్యే బీరం సమక్షంలోనూ చేరికలు కొనసాగాయి. హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల నుంచి భారీగా చేరిన వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.