ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 4: రెండేండ్ల వయసులోనే తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారి వియోనా చోటు దక్కించుకున్నది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సుమన్ తుమ్మల, రేఖ గూలే దంపతులు ఉద్యోగ రీత్యా లండన్‌లోని బ్రాక్నెల్ నగరంలో ని వాసముంటున్నారు. వీరి కుమార్తె వియోనా ప్రతిభను ఆన్లైన్లో పరీక్షించిన తెలు గు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి..
మెయిల్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ పంపగా బ్రాక్నెల్ నగర విద్యామండలి అధిపతి టానర్ చే తుల మీదుగా చిన్నారికి అందజేసి, అభినందించారు. సరిగా మాటలు కూడా రాని (రెండేండ్ల నాలుగు నెలల) లియోనా తక్కువ కాలంలోనే వెయ్యికి పైగా పజిల్స్ పూర్తిచేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అవార్డు అందుకున్నందుకు చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు.