ఖమ్మం రూరల్ : కంటి తుడుపు చర్యగా కాకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధి చాటుకోవాలని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల బీసీ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ లో నిర్వహించే బీసీ సంఘాల ధర్నాకు మంగళవారం ఆయా బీసీ కులాల నాయకులు బయల్దేరి వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించి చట్టబద్ధత కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా మాట నిలబెట్టుకోవాలన్నారు. బీసీలను మభ్యపెట్టి వేరే మార్గాన బిల్లు పెట్టి తూతూ మంత్రంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడితే ఊరికినే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
గ్రామ గ్రామాన ప్రతి బీసీని కలిసి రిజర్వేషన్ల సాధనతో పాటు వాటి చట్టబద్ధతకు పోరాడుతామని హెచ్చరించారు. తద్వారా బీసీల సత్తా ఏంటో చూపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు అక్కినపల్లి వెంకన్న, జడ్పుల వెంకటేశ్, పేరం వెంకటేశ్వర్లు, మొర్రిమేకల నాగేశ్వరరావు, దుర్గయ్య, అశోక్, సుంకర వెంకన్న, చావిడి రామారావు, కొలిచాల మాధవరావు, దొంతగాని వెంకట్ నారాయణ, కుర్రి తిరుపతయ్య, తోట శ్రీకాంత్, చెన్నబోయిన కృష్ణయ్య, మట్టా శ్రీకాంత్, మరికంటి భద్రయ్య, నూకల సైదులు, శంకర్ రాజ్, దండి నరసయ్య, మేకల ఉదయ్, చీరాల వీరభద్రం, పల్లెబోయిన వెంకటేశ్వర్లు, సురేశ్ గౌడ్, వెంకన్న పాల్గొన్నారు.