e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News నేడు కోవే సదస్సు

నేడు కోవే సదస్సు

  • హాజరుకానున్న 40మంది మహిళా పారిశ్రామికవేత్తలు
  • మీడియా భాగస్వామిగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’

సిటీబ్యూరో, నవంబర్‌ 26 (నమస్తే తెలంగాణ): కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (కోవే) తెలంగాణ చాప్టర్‌ 17వ అవతరణ దినోత్సవం శనివారం జరుగుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేటలోగల కోవే కార్యాలయంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 40 మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొని వ్యాపార రంగంలో తమ అనుభవాలను పంచుకోనున్నారు. వ్యాపార ప్రారంభం, ఎదురైన ఒడిదుడుకులు, సవాళ్లు, విజయాలపై మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్‌నర్స్‌గా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ వ్యహరిస్తున్నాయి. కాగా, వివిధ కార్యక్రమాల ద్వారా మహిళా ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు మెరుగైన అవకాశాల్ని కోవే కల్పిస్తున్నది. ముఖ్యంగా స్టార్టప్‌లకు దన్నుగా నిలుస్తున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement