హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ( BJP MP ) తేజస్వీ సూర్య దేశ విభజన ( Country Partition ) తో పోల్చడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraju Ravichand ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన ప్రజలు అహింసా మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం యావత్ ప్రపంచానికి తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి బీజేపీ ఎంపీ దేశ విభజనతో పోల్చడం దుర్మార్గమన్నారు.
దేశ అత్యున్నత చట్టసభలో కనీస అవగాహన లేకుండా మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలను అవమానించడమేనని, ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన తెలంగాణకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలని కోరారు.