Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Idiragandhi International Airport) లో ఇవాళ సాయంత్రం రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. విమానాలు ఒకదానికొకటి స్వల్పంగా ఢీకొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Delhi Airport : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Idiragandhi International Airport) లో ఇవాళ సాయంత్రం రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. విమానాలు ఒకదానికొకటి స్వల్పంగా ఢీకొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ విమానాలు ఏమాత్రం వేగంగా ఢీకొన్నా భారీగా ప్రాణనష్టం జరిగేది. ట్యాక్సీ వేపై ఆకాశ ఎయిర్ (Akasa Air), స్పైస్‌జెట్ (SpiceJet) కు చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానాశ్రయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ బీ737-700 విమానం ట్యాక్సీయింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆకాశ ఎయిర్ విమానం అక్కడ నిలిపి ఉంది. వేగంగా వస్తున్న స్పైస్‌జెట్ విమానం కుడి రెక్క నిలిపి ఉన్న ఆకాశ విమానం తోక భాగంలోని స్టెబిలైజర్‌ను తాకింది. దాంతో రెండు విమానాల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఆకాశ ఎయిర్ వెంటనే స్పందించింది.
తమ విమానం ఆగి ఉన్నప్పుడు మరో విమానం వచ్చి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలిసిందని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది అందరినీ సురక్షితంగా విమానం నుంచి దించామని, హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా దెబ్బతిన్న రెండు విమానాలను అధికారులు పరిశీలన కోసం బేకు తరలించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరిపే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

