తాష్కెంట్: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్ (81 కేజీలు) స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. తాష్కెంట్ వేదికగా సోమవారం జరిగిన పురుషుల 81 కేజీల విభాగం ఫైనల్లో అజయ్ మొత్తం 322 (147+175) కిలోలు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో జాతీయ రికార్డు (147 కేజీలు)ను నెలకొల్పాడు. మహిళల 59 కిలోల విభాగంలో హజరికా 189 కేజీలు (84+105) ఎత్తి రజతం సాధించింది. బంగారు పతకంతో అజయ్ నేరుగా 2022 బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఎంపికయ్యాడు. ఈ క్రీడలకు ఇప్పటికే జెరెమీ లాల్‌రినుగా (67 కేజీలు), అచింత షెహులీ (73 కేజీలు) అర్హత సాధించారు.