e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ఆర్ఆర్ఆర్: రెండు పోస్ట‌ర్‌లో కామ‌న్ వ‌స్తువు గ‌మ‌నించారా..!

ఆర్ఆర్ఆర్: రెండు పోస్ట‌ర్‌లో కామ‌న్ వ‌స్తువు గ‌మ‌నించారా..!

ఆర్ఆర్ఆర్:  రెండు పోస్ట‌ర్‌లో కామ‌న్ వ‌స్తువు గ‌మ‌నించారా..!

బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నాడు. ఇక రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న సీత పాత్ర‌లో అలియా భ‌ట్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.  రీసెంట్‌గా అలియా బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అలియా మెడ‌లో ఉన్న లాకెట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అందుకు కార‌ణం ఆ మ‌ధ్య రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ మొద‌లైంది అంటూ చెర్రీ, ఎన్టీఆర్ చేతులు క‌లిసి ఉన్న ఫొటో షేర్ చేశాడు. అందులో చెర్రి చేతికి ఉన్న లాకెట్‌, ఇప్పుడు అలియా భ‌ట్ మెడ‌లో ఉన్న లాకెట్ ఒకేలా ఉన్నాయి. 

అల్లూరి సీతారామ‌రాజు చరిత్ర చూస్తే రామ‌రాజుని సీత అనే యువ‌తి ఎంతో ఇష్ట‌ప‌డుతుంద‌ట‌. ఇద్ద‌రు పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకున్నారు. కాని స్వాత్రంత్య్ర ఉద్యమంలో కీల‌కంగా  మారిన త‌ర్వాత పెళ్లి చేసుక‌నేందుకు నిరాక‌రించాడు రామ‌రాజు. దీంతో సీత క‌న్నుమూయ‌గా, ఆమె గుర్తుగా సీతారామ‌రాజు అని పేరు మార్చుకున్నార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలోను ఇలానే చూపించ‌నున్నార‌ని,  సీత పాత్ర పోషిస్తున్న అలియా భ‌ట్ క‌న్నుమూయ‌డంతో ఆమె మెడ‌లో ఉన్న లాకెట్‌ను చ‌ర‌ణ్ ధ‌రిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి జ‌క్క‌న్న ఏ విజ‌న్‌లో సినిమా తెర‌కెక్కించాడ‌న్న‌ది అక్టోబ‌ర్ 13న తెలుస్తుంది.  అజ‌య్ దేవ‌గ‌న్, స‌ముద్ర ఖ‌ని, శ్రియ‌, రాహుల్ రామ‌కృష్ణ, రాజీవ్ క‌న‌కాల‌ త‌దిత‌రులు చిత్రంలో  కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు.  కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్ఆర్ఆర్:  రెండు పోస్ట‌ర్‌లో కామ‌న్ వ‌స్తువు గ‌మ‌నించారా..!

ట్రెండింగ్‌

Advertisement