మళ్లీ బండ పడింది

- వాణిజ్య సిలిండర్‌పై రూ.100.50 వడ్డింపు
- బుధవారం నుంచే అమల్లోకి వచ్చిన పెంపు
- ఢిల్లీలో రూ.2,101కి చేరుకున్న ఎల్పీజీ
- గడిచిన మూడు నెలల్లోనే రూ.484 పెంపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 100.50ను వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపు బుధవారం (డిసెంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,101కి చేరగా, ముంబైలో రూ. 2,051కు చేరింది. 14 కిలోల సాధారణ వంటగ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి పెంపు లేదు.
3 నెలలుగా ఆగని వాత
గడిచిన 3 నెలల్లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 484 పెరిగింది. సెప్టెంబర్ 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,694గా ఉన్నది. దీనిపై అదేరోజు రూ.75 పెంచారు. అక్టోబర్ 1న రూ. 43, నవంబర్ 1న రూ.266 వడ్డించారు. తాజాగా రూ.100.50 పెంచడంతో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,101కు చేరుకున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

