Comedy Wildlife Photo Awards : నవ్విన పాము, యాంగ్రీ బర్డ్, కోతి డ్యాన్స్.. నవ్వు తెప్పిస్తున్న వైల్డ్‌లైఫ్ ఫోటోలు
నవ్విన పాము, యాంగ్రీ బర్డ్, కోతి డ్యాన్స్ | వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ మీద ఇష్టంతో.. అడవుల్లో తిరుగుతూ.. అక్కడ నివసించే జంతువుల లైఫ్‌స్టైల్‌ను వాళ్ల కెమెరాలో బంధిస్తుంటారు
వైల్డ్‌లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అడవుల్లో ఉండే జంతువులకు ఆ అడవే ప్రపంచం. అదే వాటి జవనాధానం. అక్కడే అవి అడుతాయి.. పాడుతాయి.. తోటి జంతువులతో సరదాగా ఎంజాయ్ చేస్తాయి. అయితే.. మనకు అవన్నీ చూసే అదృష్టం ఉండదు. అడవుల్లో జంతువుల దగ్గరికి వెళ్లి.. అవి ఎలా జీవిస్తున్నాయో చూడలేం. అందుకే.. వైల్డ్‌లైఫ్‌ను కళ్లకు కట్టినట్టుగా మనకు చూపిస్తుంటారు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫర్లు. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ మీద ఇష్టంతో.. అడవుల్లో తిరుగుతూ.. అక్కడ నివసించే జంతువుల లైఫ్‌స్టైల్‌ను వాళ్ల కెమెరాలో బంధిస్తుంటారు. వాళ్లు తీసే ఫోటోల్లో అన్ని రకాల హావభావాలు ఉంటాయి. వాటిలో కామెడీని జనరేట్ చేసే ఫోటోలతో నిర్వహించేదే కామెడీ వైల్డ్‌లైఫ్ ఫోటో అవార్డ్స్ కాంపిటిషన్.

కామెడీ చేయడం మీకే వచ్చా.. మాకు కూడా వచ్చు అన్నంత రేంజ్లో జంతువులు, పక్షులు, ఇతర జీవులు.. చేసే ఫన్నీ సంఘటనలను క్లిక్‌మనిపించి ఈ కాంపిటిషన్లో ప్రదర్శిస్తారు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫర్లు.
ప్రతి సంవత్సరం లాగానే.. ఈసంవత్సరం కూడా కామెడీ వైల్డ్‌లైఫ్ అవార్డ్స్ కోసం కాంపిటిషన్ నిర్వహించారు. ఆ కాంపిటిషన్లో షార్ట్‌లిస్ట్ అయిన ఫోటోలు 42. ఆ ఫోటోలను చూస్తే మాత్రం వామ్మో.. జంతువులలో ఇటువంటి కళ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతాం. వాటి కామెడీ టైమింగ్‌కు ఫిదా అవుతాం.
నిజానికి ఈ కాంపిటిషన్ 2015లో ప్రారంభం అయింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్లు.. పాల్ జాన్సన్, హిక్స్, టామ్ సుల్లమ్ అనే ముగ్గురు ఈ కాంపిటిషన్‌ను స్టార్ట్ చేశారు. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి కొంచెం హ్యూమర్ టచ్ ఇచ్చారు. అలాగే.. ఈ కాంపిటిషన్ ద్వారా వచ్చే అదాయాన్ని జంతువుల సంరక్షణ కోసం.. కొన్ని జాతుల పరిరక్షణ కోసం వాడుతుంటారు. ఈసంవత్సరం.. అడవి ఓరంగుటాన్స్ అనే జంతువుల పరిరక్షణ కోసం.. వచ్చే ఆదాయంలో 10 శాతం చారిటీకి ఇవ్వనున్నారు. ఇక.. ఈ సంవత్సరం ఈ కాంపిటిషన్ కోసం వచ్చిన ఎంట్రీ ఫోటోలు చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. ఎందుకో.. ఆ ఫోటోల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి.
Laughing snake

నవ్వే పామును ఎప్పుడైనా చూశారా? పాము నవ్వడం ఏంటి అంటారా? ఈ పామును చూస్తే.. నవ్వినంటే ఉంటుంది. వీటిని వైన్ స్నేక్స్ అని అంటారు. ఇవి ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్‌లో కనిపిస్తుంటాయి. వాటికి సమీపంగా వెళ్తే చాలు.. అవి చాలా కోపంతో తమ నోరును తెరుస్తాయి. అవి కోపంతో నోరు తెరిచినా.. చూడటానికి.. అవి నవ్వుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ ఫోటోను ఇండియాకు చెందిన ఆదిత్య క్షీరసాగర్ అనే ఫోటోగ్రఫర్ తీశాడు.
Monday Morning Mood

వీకెండ్ తర్వాత సోమవారం ఉదయమే ఆఫీసుకు వెళ్లాలంటే మనం ఫేస్ ఎలా పెడతామో.. ఈ పక్షి కూడా అలాగే ఫేస్ పెట్టింది. ఈ పక్షి మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అంది. ఈ పక్షి పేరు pied starling. ఈ ఫోటోను సౌత్ఆఫ్రికాలో ఆండ్రియో మాయెస్ అనే వ్యక్తి తీశాడు.
Directing penguin

రెండు పెంగ్విన్లు ముచ్చట్లు పెట్టుకుంటున్న సీన్ అది. అప్పటి వరకు మంచులో సర్ఫింగ్ చేసి వచ్చి.. సీరియస్‌గా ఆ రెండు ఏదో డిస్కషన్ పెట్టాయి. అదే సమయంలో.. కరోల్ టేలర్ అనే ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోను క్లిక్‌మనిపించారు. యూకేలోని ఫాల్క్లాండ్ ఐలాండ్‌లో ఈ ఫోటోను తీశాడు.
Time for school

జంతువులయినా.. మనుషులైనా.. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒట్టర్ అనే ఓ జంతువు.. తన బేబీని ఏదో అల్లరి చేస్తుంటే మందలిస్తున్నట్టుగా ఉంది కదా ఈ ఫోటో. నీకు బాగా ఎక్కువైతోంది. పదా.. స్కూల్‌కు అన్నట్టుగా తన బేబీని నోటకరుచుకొని ఆ జంతువు వెళ్తున్నట్టుగా ఉంది.
Monkey riding a giraffe

కోతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కోతి చేసే అల్లరి చేష్టలు మామూలుగా ఉండవు. ఈ ఫోటోలో చూడండి.. కోతి ఏకంగా.. జిరాఫీ మీదికి ఎక్కి రైడింగ్ చేస్తోంది. ఈ ఫోటోను నెదర్లాండ్స్‌కు చెందిన డిర్క్ జాన్ స్టీహౌవర్ తీశాడు.
The Green Stylist

రంగులు మార్చే ఊసరవెల్లి రాజసం చూడండి. ఆకుపచ్చ రంగులో ఎండిపోయిన చెట్టు కర్ర మీద కూర్చొని ఉన్న ఈ ఫోటోను వెస్టర్న్ ఘాట్స్‌లో గురుమూర్తి అనే ఫోటోగ్రఫర్ తీశాడు.
Ouch!

చైనాలో ఉండే అరుదైన గోల్డెన్ సిల్క్ జాతికి చెందిన కోతి ఇది. కరెంట్ తీగ మీద కూర్చొని అది చేస్తున్న రచ్చ చూడండి. అలా కూర్చునే సరికి.. దానికి ఎక్కడో నొప్పి పుట్టినట్టుగా ఉన్న ఫోటో అది. దీన్ని యూకేకు చెందిన ఫోటోగ్రఫర్.. చైనాలో తీశాడు.
Operatic warm ups

కంగారూ చూడండి.. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఏదో పాట పాడుతున్నట్టుగా ఉంది కదా. ఈ ఫోటోను ఆస్ట్రేలియాకు చెందిన లియా స్కాడెన్ తీశాడు.
Did I say you could take my picture?

కింగ్లెట్ అనే పక్షి కోసం యూఎస్‌కు చెందిన పాట్రిక్ డిర్లామ్ అనే ఫొటోగ్రఫర్.. కనీసం ఓ 15 నిమిషాలు అటూ ఇటూ తిరిగాడట. చివరకు అది కనిపించేసరికి.. దాన్ని క్లిక్మనిపిద్దామని అనుకునే సరికి.. అది సడెన్‌గా ఆగి.. కోపంగా తనవైపు చూసిందట. నన్ను ఎందుకు ఫోటో తీస్తున్నావు.. అన్నట్టుగా అది సీరియస్‌గా చూసి అక్కడి నుంచి తుర్రుమన్నదట.
Dancing Away to Glory

లంగూర్ జాతికి చెందిన కోతి.. వేసే డ్యాన్స్ చూడండి. అది.. దాని వేషాలు ఎలా ఉన్నాయో చూశారు కదా. ఈ ఫోటోను భారత్‌కు చెందిన సరోశ్ లోధి అనే ఫోటోగ్రఫర్ తీశాడు.
Smoked Deer for Dinner

ఈ ఫోటోను భారత్‌కు చెందిన సిద్ధాంత్ అగర్వాల్ తీశాడు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో గత కొన్నేళ్ల నుంచి పారో అనే ఆడపులి ఫ్యామిలీని ఫాలో అవుతున్నాడట అగర్వాల్. దాని కూతురే ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్న పులి. తన చేతులతో ఆ కర్రను మోస్తున్నట్టుగా ఉంది కదా. నిజానికి.. ఆ చెట్టు కర్రకు తన తలను అటూ ఇటూ స్క్రాచ్ చేస్తున్నప్పుడు క్లిక్‌మనిపించిన ఫోటో అది.
Majestic and Graceful Bald Eagle

ఎండిపోయిన చెట్టు కొమ్మల మధ్య చిక్కుకుపోయినట్టుగా కనిపిస్తున్న ఈ గద్ద.. నిజానికి ఒక్కసారి తన రెక్కలను విదిల్చితే చాలు.. అందులో నుంచి బయటపడతుంది. సరిగ్గా.. అది ఆ కొమ్మల మధ్య ఇరుక్కున్నప్పుడు తీసిన ఫోటో ఇది. దీన్ని యూఎస్‌కు చెందిన డేవిడ్ ఎప్లే అనే ఫోటోగ్రఫర్ తీశాడు.
Don’t worry. Be happy!

కెమెరా వైపు ఎంతో ఖుషీగా చూస్తున్న ఈ తూనీగను చూడండి. ఈ ఫోటోను జర్మనీకి చెందిన అక్సెల్ బాకర్ తీశాడు.
The Baboon who feels like a tenor

బాబూన్ జాతికి చెందిన కోతి.. ఆవలిస్తుండగా తీసిన ఫోటో ఇది. సౌదీ అరేబియాలో క్లెమెన్స్ అనే వ్యక్తి ఈ ఫోటోను తీశాడు. మేకప్ వేసుకొని రెడీ అయి.. స్టేజ్ మీద ఏదో పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టుగా పోజు ఇచ్చింది కదా ఈ కోతి.
కాంపిటిషన్లో షార్ట్‌లిస్ట్ అయిన ఇలాంటి మరెన్నో ఫన్నీ వైల్డ్‌లైఫ్ ఫోటోలను ఈ వెబ్సైట్లో చూడొచ్చు. https://www.comedywildlifephoto.com/gallery/finalists/2021_finalists.php
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Bird Photographer of the Year 2021 : పక్షుల ఫోటోగ్రఫీ.. అవార్డ్స్ గెలుచుకున్న ఈ ఫోటోలను చూసి ఫిదా కావాల్సిందే..!
Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
Barbie doll : బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

