CM Revanth Reddy | తమ హయాంలో డ్రగ్స్ వాడకం, విక్రయం ఎలా పెరిగిపోయిందో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టి కి వస్తున్నాయి. కొన్ని మేం సమాజానికి చెప్తం.. కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు. స్కూల్స్ ముందు , చిన్నచిన్న కిరాణ కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు, ఇంజినీర్లు డ్రగ్స్ పెడ్లింగ్ (అమ్మడం) చేస్తున్నారన్నారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. దీనికంతా కారణం ఏ నేరం తీసినా మహిళల మీద జరుగుతున్న విచక్షణా రహితమైన దాడులను కానీ.. చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలు చూస్తే ప్రధానం నేరానికి పాల్పడ్డవాళ్లు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వారే ఈ నేరాల్లో పాల్గొంటున్నారన్నారు.
నా ప్రభుత్వంలో మాదక ద్రవ్యాల వాడకం, విక్రయం విచ్చలవిడిగా పెరిగిపోయింది
చదువుకున్న వాళ్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నారు
మహిళల మీద నేరాలకు పాల్పడిన వారిలో ఎక్కువ శాతం మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వాళ్లే ఉన్నారు – రేవంత్ రెడ్డి pic.twitter.com/b0Ch1V42rJ
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2026