కోల్కత్తా, ఫిబ్రవరి 21: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గవర్నర్ జగ్దీప్ ధన్కర్పై ధ్వజమెత్తారు. తాను పంపిన ఫైల్స్‌ను గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గవర్నర్ ఫైళ్లపై సంతకం చేయట్లేదు. క్యాబినెట్ ఆమోదించాలని చెప్తున్నారు. క్యాబినెట్‌కు ముఖచిత్రమే సీఎం. ఆయన ఎందుకిలా చేస్తున్నారో నాకర్థం కావట్లేదు’ అన్నారు.