ప్రధాని మోదీ చెప్పేది ఒక్కటి.. చేసేది ఒక్కటి.. ప్రెస్మీట్లో కేసీఆర్ ఫైర్
KCR Pressmeet | ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఒక్కటని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చిన్రు అని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. అయినా ప్రజలకు కొన్ని వివరాలు చెప్పాలని చెప్పాం. నరేంద్ర మోదీ గారు ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటున్నది. అబద్దాలు చెబుతున్నరు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చింన్రు. డ్రాఫ్ట్ బిల్లు రెడీ అయ్యింది. డ్రాఫ్ట్ బిల్లు చేసి రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. దానికి జవాబు ప్రధానికి లేఖ రాశారు. అదే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాం. వీటన్నింటిని మించి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్లియర్‌గా వాళ్ల పాలసీ చెప్పారు. అడిషనల్ బారోఇంగ్ లింక్డ్ టూ పవర్ సెక్టార్ రిఫార్మ్స్. ఇది పార్లమెంట్లో వాళ్లు ఇచ్చిందే.. ఇది కేసీఆర్ స్టోరీ కాదు. అగ్రికల్చర్ సెక్టార్‌కు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు.. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలి.
కేంద్రం పంపిన ముసాయిదా బిల్లు. అది మెడమీద వేలాడుతున్న కత్తి. బిల్లు పాస్ కాకముందే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ రీఫామ్స్ చేస్తరో అడిషనల్‌గా 0.5 ఎఫ్ఆర్బీఎం ఇస్తమని ప్రకటించారు. అది ఐదేళ్లు ఇస్తమని ప్రకటించారు. పోయిన ఏడాది మనం తీసుకోలేదు. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నది. తీసుకోవడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారు. మిగతా వాటికి టెండర్లు పిలిచారు. రూ.737కోట్లతో టెండర్లు పిలిచారు. 0.5శాతం అడిషనల్ ఎఫ్ఆర్బీఎం వస్తే రూ.5వేలపైచీలుకు కోట్లు వస్తయ్. రాబోయే ఐదేళ్లకు విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ఇస్తం.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వం. నష్టపోయిన మంచిది నీ డబ్బులు అక్కర్లేదంటే రూ.25వేలకోట్లు నష్టపోవాలే తెలంగాణ. ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్ల పెట్టా అని చెప్పిన.
తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి.. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నరు కాబట్టి నేను పెట్టా అని చెప్పిన. శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు పెట్టారు. టెండర్లు పిలిచారు.. ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం ఇస్తున్నరు. ఇన్ని ఉండంగ.. మొన్న బడ్జెట్లో పెట్టారు.. ఇన్ని ఉండంగా.. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు. చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ నన్నడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజుకు. ఇవన్ని ఆధారాలుండి.. ఇంత జరిగి.. రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపి.. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండి పచ్చి అబద్దం చెబుతాం. దీనిపై బహిరంగ క్షమాపణ చెబుతా. మీటర్లు పెట్టుమన్నా..? పెట్టుమనందే జగన్మోహన్రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళంలా పెట్టిండా. పెట్టుమనంతా ఎఫ్‌ఆర్‌బీఎంలా 0.5శాతం పెట్టినవా?.. దాన్ని మేం ఎందుకు తీసుకుంటలేమ్. ఎఫ్ఆర్బీఎం పవర్ రీఫామ్స్ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ” అంటూ మండిపడ్డారు.
KCR Press Meet Live Updates | ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

