తెలంగాణ దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్
దళితబంధు | తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ

హైదరాబాద్ : తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందన్నారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించినట్లు గుర్తు చేశారు.
ప్రతీ విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయని.. తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడే విజయం సాధ్యమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్నారు. మనిషిపై మనిషి వివక్ష చూపే దుస్థితి గురించి.. సెంటర్ ఫర్ సెబాల్టర్న్ స్టడీ ద్వారా అధ్యయనం చేసినట్లు చెప్పారు. దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్స్టేషన్లలో రద్దు చేసుకోవాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని, అప్పుడే మన విజయానికి బాటలుపడుతాయన్నారు. సమావేశంలో నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితబంధువులతో పాటు 15 మంది రీసోర్స్ పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: ఫెన్సింగ్ రెండో రౌండ్లో ఓడిన భవానీ దేవి
Tokyo Olympics: టీటీ మూడో రౌండ్లోకి ప్రవేశించిన శరత్ కమల్
దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు
శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద
నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి ఎర్రబెల్లి
భక్తుల బాధ్యత నాదే.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
దళిత బంధువులతో సీఎం కేసీఆర్ సమావేశం
Vaccine trials for kids : చిన్నారులకు కొవాగ్జిన్ సెకండ్ డోస్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

