మెండొర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహరాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం ఉదయం ప్రాజెక్ట్ గేట్లను మూసివేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. మొత్తం బాబ్లీ 14 గేట్లను మూసివేశారన్నారు. తిరిగి మార్చి 1 వ తేదీన తాగు నీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్ ఆవు, దవనే నాందేడ్, బావే, డీఈ గణేష్, ఏఈఈ వంశీ తదితరులున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి 7800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని, ఎస్కేప్ గేట్లను శుక్రవారం ఉదయం మూసివేసినట్లు తెలిపారు. కాకతీయ కాలువకు 5 వేలు, లక్ష్మి కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీల) పూర్తి సామర్థ్యం కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం కలిగి ఉందని ఈఈ తెలిపారు.