CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
CJP protest : సీజేపీ మరోసారి భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 16, శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో ఆందోళన చేపట్టాలని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే బుధవారం పిలుపునిచ్చారు.
CJP protest : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఇప్పటివరకు పూర్తిస్థాయి ఆందోళన చేపట్టలేకపోయింది సీజేపీ. ఈ నేపథ్యంలో మరోసారి భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 16, శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో ఆందోళన చేపట్టాలని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే బుధవారం పిలుపునిచ్చారు. లెహ్రా దో తిరంగా అంటే మూడు రంగుల జాతీయ పతాకాన్ని ఊపడం అని అర్థం.
ఢిల్లీ, బిజినెస్ హబ్ పరిధిలోని, కన్నౌట్ ప్లేస్, సెంట్రల్ పార్క్ వద్ద ఈ ఆందోళన చేపట్టనున్నట్లు అభిజీత్ దీప్కే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు జాతీయ జెండాతో రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. జెండా ఎగురవేసినందుకే సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను జైలులో పెట్టారని దీప్కే విమర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై దీప్కే విమర్శలు చేశారు. తిరంగా జెండాను ఊపడం నేరమా అంటూ ప్రశ్నించారు.
ఢిల్లీలో అనుమతి లేకుండా ఆందోళన చేసి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించినందుకుగాను సౌరవ్, రాంకాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారికి ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో ఇద్దరూ ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. ఇద్దరినీ పోలీసులు వేర్వేరు గదుల్లో ఉంచారు. ఢిల్లీ తిరంగా మార్చ్‌లో పాల్గొనాలని దేశ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ రాలేని వారు తమ సొంత ప్రాంతాల్లోనే తిరంగా మార్చ్ నిర్వహించాలని సూచించారు.
అక్టోబర్ 16న ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమం నిర్వహించి, జెండా ఊపాలని, ఇలా చేయడం నేరం కాదని నిరూపించాలని దీప్కే కోరారు. సీఈసీ రాజీనామా అంశంలో సీజేపీ చేపడుతున్న ప్రతి ఆందోళనను ప్రభుత్వం అణచివేయడమో, అడ్డుకోవడమో చేస్తూ వస్తోంది. అందుకే, సీజేపీ ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. అయితే, మరోసారి దీప్కే ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి ప్రభావం చూపుతారో చూడాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

