ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జాతీయ రహదారి–65పై హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాల్లో టీజీ ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. మొత్తం 10 ప్రత్యేక బృందాల్లో సుమారు 60 మంది అధికారులు...
– 7 హోటళ్ల లైసెన్స్‌లు సస్పెండ్, లైసెన్స్ లేని హోటల్ సీజ్
నల్లగొండ రూరల్, అక్టోబర్ 14 : జాతీయ రహదారి–65పై హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాల్లో టీజీ ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. మొత్తం 10 ప్రత్యేక బృందాల్లో సుమారు 60 మంది అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మొత్తం 20 ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేసి, పరీక్షల నిమిత్తం 20 ఆహార నమూనాలను సేకరించారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన ఏడు సంస్థల లైసెన్స్‌లను సస్పెండ్ చేయగా, లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఓ హోటల్‌ను సీజ్ చేశారు. మరోవైపు నిబంధనల ఉల్లంఘనలపై షోకాజ్, మెరుగుదల నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో 10, సూర్యాపేట జిల్లాలో ఆరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు సంస్థలను తనిఖీ చేశారు. ఆయా హోటళ్లలో పప్పుధాన్యాలు, చికెన్ కర్రీ, టీ పొడి, జీడిపప్పు, పనీర్, వంటనూనె, సాస్‌లు తదితర ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు.

ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
అపరిశుభ్రతపై అధికారుల ఆగ్రహం
పలు హోటళ్లలో పురుగులు, బొద్దింకలు, అపరిశుభ్రమైన రిఫ్రిజిరేటర్లు, ఫంగస్ పట్టిన కూరగాయలు, ఎలుకల విసర్జనలతో కలుషితమైన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. శాకాహార, మాంసాహార పదార్థాలను కలిపి నిల్వ చేయడం, పచ్చి మాంసంతో ఐస్ ముక్కలను ఉంచడం, వంటగదుల్లో పరిశుభ్రత పాటించకపోవడం వంటి లోపాలు వెలుగుచూశాయి. అనుమతిలేని సింథటిక్ రంగుల వినియోగం, ఆహార పదార్థాల లేబులింగ్‌లో లోపాలు, సిబ్బంది వైద్య ధ్రువపత్రాలు, పురుగుల నియంత్రణ రికార్డులు లేకపోవడాన్ని కూడా గుర్తించారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే తనిఖీల లక్ష్యమని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాల నిర్వాహకులు చెల్లుబాటు అయ్యే ఆహార భద్రత లైసెన్స్‌లను ప్రదర్శించాలని, వంటగదులు, నిల్వ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

