హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): సివిల్స్‌లో ఆల్ ఇండియాలో 83వ ర్యాంకు సాధించిన టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కే రాములు కూతురు కావలి మేఘనను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. కష్టపడి లక్ష్యంకోసం పనిచేసేవారికి మేఘన స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెను సత్కరించారు. మేఘన శుక్రవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మేఘన పెదనాన్న, జహీరాబాద్ మాజీ జడ్పీటీసీ కే భాస్కర్ తదితరులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.