అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇన్స్పెక్టర్ షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భగవాన్ ప్రసాద్.. పశ్చిమగోదావరి జిల్లాలోని గణపవరంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గణపవరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడేందుకు వెళ్లారు. ఆట మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు ఆయనకు ఊపిరి అందించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయనలో చలనం లేకపోవడంతో దవాఖానకు తరలించారు. అయితే భగవాన్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 2003లో కానిస్టేబుల్లో ఆయన పోలీస్ శాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సీఐ షటిల్ ఆడుతూ కుప్పకూలడం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. pic.twitter.com/n03ASFqPF3
— Namasthe Telangana (@ntdailyonline) March 24, 2021