వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచించిన రామాయణ మహాకావ్యం సమాజానికి స్ఫూర్తిదా యకమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
ఊట్కూర్, అక్టోబర్ 26 : సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచించిన రామాయణ మహాకావ్యం సమాజానికి స్ఫూర్తిదా యకమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరిం చుకొని సోమవారం నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అమూల్యమైన సాహిత్య సంపద అని పేర్కొన్నారు.
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని, ఆయన చూపిన సత్యధర్మాల మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఊట్కూర్ మండలం నిడుగుర్తి, చిన్నపోర్ల, పెద్ద పోర్ల, కొత్తపల్లి తదితర గ్రామాల్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహర్షి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి ఆశయాలను స్మరించుకున్నారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

