నాగార్జున, అమల తనయుడు అఖిల్‌కు మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. సక్సెస్‌కి హార్డ్ వర్క్‌ని మించిన ఫార్ములా లేదు. నువ్వు ఆ హార్డ్ వర్క్‌నే నమ్ముకున్నావని నేను నమ్ముతున్నాను. నీకు సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. నీ కలలు తప్పక నిజం అవుతాయి. హ్యాపీ బర్త్ డే అఖిల్ అంటూ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రాన్ని చేయగా, ఈ మూవీ అతి త్వరలో విడుదలకి సిద్ధమైంది. ఇక త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు అఖిల్. ఈ మూవీకి ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, కొద్ది సేపటి క్రితం పూజా కార్యక్రమాలతో మూవీ మొదలు పెట్టారు. నాగార్జున, అమలతో పాటు చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనిల్ సుంకర- ఎకె ఎంటర్ టైన్మెంట్స్ – సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ నెల 11 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుండగా, 2021 డిసెంబర్ 24 న ఏజెంట్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
సక్సెస్ కి hardwork ని మించిన ఫార్ములా లేదు. నువ్వు ఆ hardwork నే నమ్ముకున్నావని నేను నమ్ముతున్నాను. Wish you All the Success and Wish all your dreams to come true.Happy Birthday @AkhilAkkineni8 !
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021
Here are the Pics from the Grand Launch of #Agent ⚡@AkhilAkkineni8 @DirSurender@AnilSunkara1 @MusicThaman @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/FRKzoLqtVp
— BA Raju's Team (@baraju_SuperHit) April 8, 2021