Chiranjeevi | ఫస్ట్ లవ్ గురించి అమీర్‌ఖాన్‌కు చెప్పిన చిరు..ప్రోమో వైరల్
లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో అమీర్ ఖాన్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా అమీర్ ఖాన్, చిరంజీవి, నాగచైతన్య స్పెషల్ చిట్‌చాట్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ ముగ్గురినీ అక్కినేని నాగార్జున ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోను వి
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir khan) నటిస్తున్న తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya) కీ రోల్ చేస్తున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమర్పిస్తున్నారు. ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో అమీర్ ఖాన్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా అమీర్ ఖాన్, చిరంజీవి, నాగచైతన్య స్పెషల్ చిట్‌చాట్ సెషన్ లో పాల్గొన్నారు.
ఈ ముగ్గురినీ అక్కినేని నాగార్జున ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోను విడుదల చేశారు. ఆకాశంలో నక్షత్రాల కూటమిని గెలాక్సీ అంటారు. అటువంటి గెలాక్సీ నా ఎదురుగా కూర్చుంది..అమీర్, చిరు, చైతూ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ మొదలైంది ప్రోమో. సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు జవాబిచ్చాడు అమీర్. మీరు మొదటిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు. ఏడో తరగతిలో..అంటూ మొగల్తూరు స్టోరీ లవ్ ట్రాక్‌ను చెప్పుకొచ్చాడు చిరు.
ఇంతకీ అమీర్ ఖాన్, చిరు, చైతూ షేర్ చేసుకున్న విషయాలు పూర్తి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిందే. హాలీవుడ్ క్లాసిక్ ప్రాజెక్టు ఫారెస్ట్ గంప్‌కు రీమేక్ గా వస్తుంది లాల్ సింగ్ చడ్డా. బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అమీర్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
Read Also : Sita Ramam Ticket Prices | సీతారామం టికెట్ల ధరలు ఫిక్స్..కాన్ఫిడెంట్‌గా మేకర్స్
Read Also : Rajinikanth | మాధవన్‌ను సత్కరించిన రజినీకాంత్..వీడియో వైరల్
Read Also : Bimbisara | ప్రమోషన్స్ లో బిజీ..బింబిసార మేకర్స్ కొత్త అప్డేట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

