న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వారం నుంచి బ్లాక్లో ఉన్నాయని ఆర్మీ, నిఘా వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఫేస్బుక్ దృష్టికి తీసుకెళ్లినా, ఇంకా సమాధానం రాలేదని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మెటా యాజమాన్యంలోని ఈ రెండు సంస్థలు చినార్ కార్ప్స్ పేజీలను ఎందుకు బ్లాక్ చేశాయన్న దానిపై స్పష్టత రాలేదు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఫేక్ వార్తలు, అబద్ధాలను కౌంటర్ చేయడంతో పాటు జమ్ముకశ్మీర్లో నెలకొన్న క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను చెప్పేందుకు చినార్ కార్ప్స్ విభాగం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలను క్రియేట్ చేసుకున్నది.