బీజింగ్: వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు సమీపంలో చైనా త్వరలో ఓ రైల్ లింక్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. గ్జ్సియాంగ్ ప్రావిన్స్ నుంచి టిబెట్ వరకు ఈ లింక్‌ను నిర్మించనుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి కావొచ్చని.. ప్రభుత్వ కంపెనీ ఈ ప్రాజెక్ట్ పనులు చేపట్టనున్నదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు రక్షణ రంగ ప్రాధాన్యం ఉందని తెలిపింది. 5 వేల కి.మీ మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 13.2 బిలియన్ యూఎస్ డాలర్ల మూల ధనంతో గ్జ్సియాంగ్-టిబెట్ రైల్వే కంపెనీని రిజిస్టర్ చేశారు. ఈ మార్గంలో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో గతంలో నిర్మించిన జి219 హైవేపై 1962లో భారత్-చైనా యుద్ధం జరిగింది.