సత్వర సేవలు అందించేందుకే ‘బాల రక్షక్’ వాహనాలు : మంత్రి గంగుల
Minister Gangula | జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటు లోకి వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ : జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటు లోకి వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బాల రక్షక్ వాహనాన్ని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి ప్రభుత్వం బాల రక్షక్ వాహనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
నవంబర్ 14న రాష్ట్రం మొత్తం 33 వాహనాలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అన్ని జిల్లాలకు కేటాయించామన్నారు. ఆపదలో ఉన్న పిల్లలు ఎక్కడ కనపడినా హెల్ప్ లైన్ 1098 నెంబర్‌కు ఫోన్ చేస్తే ఈ సేవలకు సంబంధించిన అధికారులు వచ్చి పిల్లల సంరక్షణ చూసుకుంటారని అన్నారు. జిల్లాలోని బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.
అలాగే గతంలో కంటే ఇప్పుడు బాలలకు అత్యంత దగ్గరగా సేవలు అందించేందుకు అనుకూలంగా బాలల కోసం ప్రభుత్వం బాల రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న బాలల వద్దకు అధికారులు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, డిసిపిఓ శాంత, సిడబ్ల్యూసి సభ్యులు, సిడిపిఓ, ఐసిపిఎస్, చైల్డ్ లైన్, సఖి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

