IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు షాకింగ్ న్యూస్. ఫైనల్ పోరు రేపటికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుణుడు శాంతిస్తాడేమోనని అంతా ఎదురుచూశారు. కానీ, అలా జరగలేదు. దాదాపు నాలుగు గంటలకు పైగా వర్షం కురుస్తూనే ఉండడంతో స్టేడియం చిన్నపాటి చెరువును తలపించింది.
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. అయితే.. టాస్ సమయానికి స్టేడియంలో భారీ వర్షం మొదలైంది. దాంతో, మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. 4 గంటలు గడిచినా వాన తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు షాకింగ్ న్యూస్. ఫైనల్ పోరు రేపటికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుణుడు శాంతిస్తాడేమోనని అంతా ఎదురుచూశారు. కానీ, అలా జరగలేదు. దాదాపు నాలుగు గంటలకు పైగా వర్షం కురుస్తూనే ఉండడంతో స్టేడియం చిన్నపాటి చెరువును తలపించింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. అయితే.. టాస్ సమయానికి స్టేడియంలో భారీ వర్షం మొదలైంది. దాంతో, మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. 4 గంటలు గడిచినా వాన తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు.
స్టేడియంలో వర్షం కురుస్తూనే ఉంది. మ్యాచ్ కోసం అక్కడికి చేరిన ఫ్యాన్స్ వాన ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ 10ః30 గంటల కల్లా వాన తగ్గితే 15 ఓవర్ల ఆట సాగనుంది. లేదంటే రిజర్వ్ డేన(మే29న) ఫైనల్ నిర్వహిస్తారు.
మళ్లీ వాన మొదలవ్వడంతో ఫైనల్ మ్యాచ్ ఓవర్లను కుదించే అవకాశం ఉంది. వర్షం ఒకవేళ తగ్గితే 9ః45కి 19 ఓవర్లు, 10 గంటలకు అయితే 17 ఓవర్లు, 10ః30 గంటలకు వీలైతే 15 ఓవర్ల ఆట సాగనుంది.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాడు. స్టేడియంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దాంతో, పిచ్‌ను చూసేందుకు వచ్చిన ఆటగాళ్లు, అంపైర్లు అందరూ డగౌట్‌కు వెళ్లారు.
Rain Rain Go Away 🤨🫣😡 #CSKvGT #IPL2023Final pic.twitter.com/DBUFfMPDWD
— Sathish (@actorsathish) May 28, 2023
వరుణుడు శాంతించడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో టాస్ పడనుంది.
వరుణుడు శాంతించాడు. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పిచ్ కవర్ల మీది నీటిని తోడేస్తున్నారు. అంపైర్లు పిచ్‌ను పరిశీలించాక టాస్ వేసే అవకాశం ఉంది.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. ఒకవేళ 9ః35 గంటలకు వర్షం తగ్గకుంటే రిజర్వ్ డేన అంటే.. రేపు ఫైనల్ జరుగుతుంది. వాన తగ్గితే 20 ఓవర్ల ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకుంటే కనీసం 5 ఓవర్లు అయినా ఆడిస్తారు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ ఫైనల్లో గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 ఫైనల్లో అతడు ట్రోఫీ సాధించాడు. ముంబై ఇండియన్స్ తరఫున పాండ్యా 4 ఫైనల్స్(2015, 2017, 2019, 2020) ఆడాడు. వాటన్నింటిలో ముంబై కప్పు కొట్టింది. గత సీజన్లో పాండ్యా గుజరాత్‌ను ఫైనల్ చేర్చాడు. రాజస్థాల్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ ట్రోఫీ అందుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్‌కు గుడ్ బై చెప్తున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఇదే తన ఆఖరి మ్యాచ్ అని అంబటి రాయుడు అందులో పేర్కొన్నాడు. ఈరోజు అతడు 200 మ్యాచ్ ఆడనున్నాడు. అతను 2018, 2021 నుంచి సీఎస్కేతో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది.