చెన్నై : ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్‌లో యువ గ్రాండ్ మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి శుభారంభం చేశాడు. గురువారం నుంచి మొదలైన ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అర్జున్ తొలి రౌండ్లో అవాండర్ లియాంగ్‌పై గెలిచాడు. క్లాసికల్ ఫార్మాట్లో తొమ్మిది రౌండ్లుగా సాగే ఈ టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్ అర్జున్.. గేమ్ ఆసాంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు.
చెన్నైకి చెందిన ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు ప్రణవ్, కార్తీకేయన్ మధ్య హోరాహోరీగా జరిగిన మొదటి రౌండ్ గేమ్ డ్రాగా ముగిసింది. భారత్‌కే చెందిన నిహాల్.. జర్మనీ ఆటగాడు విన్సెంట్ కేమర్ చేతిలో ఓడాడు. విదిత్ గుజరాతీ తొలి రౌండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. చాలెంజర్స్ విభాగంలో వైశాలి మొదటి గేమ్‌ను డ్రా చేసుకోగా హారిక ఓటమి పాలైంది.