మట్టిపూల పరిమళం!
భాషంటే ఏంది? నా ఎత నీకు, నీ కత నాకు ఖుల్లంఖుల్లా ఎర్క జేసేదే కదా!
భాషంటే ఏంది?
నా ఎత నీకు, నీ కత నాకు ఖుల్లంఖుల్లా ఎర్క జేసేదే కదా!
భాషంటే పలికే పెదాలది కాదు
వినే మనసుది
భాషంటే ఒకరి చేతుల్లో ఆడేది కాదు
అందరి మెదళ్లలో మెదిలేది!
తెలంగాణ భాషంటే..
పుస్తకాల నుండొచ్చింది అనుకుంటున్నావేమో
మట్టి మనుషుల జీవితాల నుండొచ్చింది
ఆకాశం నుంచి దిగొచ్చింది
అనుకుంటున్నావేమో
అస్తిత్వం నుంచి ఎదిగొచ్చింది!
తెలంగాణ భాష
అమ్మ చేతి గోరుముద్దంత కమ్మగా ఉంటది
అక్క చేతి గోరింటాకంత ఎర్రగా పండుతది
పసిబిడ్డ నవ్వున్నంత స్వచ్ఛంగా ఉంటది
నాయినమ్మ మాటంత నికార్సుగా ఉంటది
తెలంగాణ భాషంటే
ఆల్కగా గోదావరి నీళ్ల లెక్క పారేది
ఒడ్డే వ్యాకరణం.. సామెతలే అలలు
పదాలే నీటి చుక్కలు.. వాక్యాలే వాగులు..
జీవితానుభవాల ఒడ్డు పొంటి
సకల జాతుల వృత్తుల మీదుగా
అన్నిటినీ కలుపుకుంట
అందరినీ అరుసుకుంట ప్రవహిస్తది
పంపన పద్యం లాగ…
పాల్కురికి పలుకులాగ
మల్లినాథ సూరి ముచ్చటలాగ
పోతన పరిణతి లాగ
దాశరథి రస హృదయం లాగ
కాళోజీ కదన కవనం లాగ
సినారె గజల్ గానం లాగ
ఈ మాగాణం ల తీరొక్క పంటను పండిస్తది!
అంతేనా…
జానపదం.. గిరిజనం…
శాస్త్రీయం.. దక్కనీల కూడలి ఇది
సర్వజనుల చౌరస్తా ఇది
చిందుల ఎల్లమ్మ యక్షగానంలో
ఒగ్గు సత్తయ్య ఢమరులో
డప్పుల దరువులో
శారద కథలలో.. కడ్డీ తంత్రి ఆలాపనలో
12 మెట్ల కిన్నెర చిలుక పలుకులలో
పేరిణి నాట్యంలో.. బద్దెన సుమతీ పద్యాలలో
ఖవ్వాలి చప్పట్లలో…
ముషాయిరా ముచ్చట్లలో
పరవళ్లు తొక్కుతూ
పరుగులు పెట్టేది తెలంగాణ భాష!
నా దోస్తులారా..
ఒక్కసారి పల్లెల పందిళ్ల కిందకొచ్చి చూడుండ్రి
ఏరుకున్నోళ్లకు ఏరుకున్నంత పదసంపద దొర్కుతది..!!
ఇక ఆఖరుగ ఒక మాట చెప్పనా…
తెలంగాణ భాషంటే
మట్టిపూల పరిమళం
మత్తడిపడే చెరువుల జీవనం
పొక్కిలైన నేల చిందించే రుధిరం
పచ్చబడ్డ పొలాల హరితం!
అయినంపూడి ,శ్రీలక్ష్మి
99899 28562
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

