కాలేశ పట్టణ విభుం భజ ముక్తి నాథం
కాళేశ్వరం ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరంలో చివరి అంకం మహాద్భుతంగా ఆవిష్కృతం కానున్నది. కాళేశ్వరుడి పేరు పెట్టుకున్నందుకు అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు పూర్తయిన శుభ సందర్భంలో ఆ కాళేశ్వరుడికి కృతజ్ఞతాంజలిగా ఈ అష్టకం.
కాళేశ్వరం ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరంలో చివరి అంకం మహాద్భుతంగా ఆవిష్కృతం కానున్నది. కాళేశ్వరుడి పేరు పెట్టుకున్నందుకు అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు పూర్తయిన శుభ సందర్భంలో ఆ కాళేశ్వరుడికి కృతజ్ఞతాంజలిగా ఈ అష్టకం.
గోదావరీ జలతరంగ కృపాంతరంగం
శ్రీమత్ప్రణీత వరసంగమ సుందర తీరవాసం!
బిల్వాటవీ ప్రధిత దివ్య సుమందిరస్థం
కాలేశ పట్టణ విభుం భజముక్తినాథం॥
కాశీ సమాన సుర వైభవ దివ్య మహోన్నతస్థం
నందీశ భృంగి పరబోధిత సూర్యమనంత సాక్షం
సర్వాగమాశ్రిత సేవిత సుందర పాద పీఠం
కాలేశ పట్టణవిభుం భజముక్తినాథం॥
కైవల్యదాయక విశేష దయాసముద్రం
కాలప్రమాణ సమధిష్ఠిత లింగతేజం
ముక్తేశ రూప శుభదర్శన దివ్యలింగం
కాలేశ పట్టణ విభుం భజముక్తినాథం॥
బాలేందు శేఖర సుసర్ప విభూషితాంగం
వేదాంత తత్త పరిశోభిత శూలపాణిం
భస్మాంగరాగ మునిసేవిత భవ్యతేజం
కాలేశ పట్టణ విభుం భజముక్తినాథం॥
విష్ణార్చితాంఘ్రి యుగళం విమలం త్రినేత్రం
వేదాలయం గరళకంఠ మనోభిరామం
వాగ్దేవతా నికట సాక్షర మంగళాంగం
కాలేశ పట్టణ విభుం భజముక్తినాథం॥
పంచాక్షరీ మను మహోజ్జల చిత్ప్రకాశం
పంచాననం విధినుత శ్శ్రుతి వాక్ప్రవిష్ణుం
విశ్వాంతరాళ పరికీర్తిత దీన బంధుం
కాలేశ పట్టణ విభుం భజముక్తినాథం॥
భూతాధిపం లలిత సుందర సుస్మితాస్యం
అర్థాంగ సత్ప్రముఖ సాంబ శుభావలంబం
రుద్రాభిషేక పరితుష్ట చిదంతరంగం
కాలేశ పట్టణ విభుం భజముక్తినాథం॥
సంసార రోగ భిషగేశ్వర విశ్వనాథం
సుర్యేందు పావక సునేత్ర మహా పవిత్రం
ఐశ్వర్యదాయక మనంత యశః ప్రమోదం
కాలేశ పట్టణ విభుం భజముక్తినాథం॥
గౌరీభట్ల ,శ్రీనాథశర్మ
99898 67211
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

