దర్శనే స్పర్శనేవాపి భాషణే భావనే తథా
యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే!
ఎవరినైన చూసినప్పుడు కానీ, తాకినప్పుడు కానీ; వారితో మాట్లాడినప్పుడు కానీ.. వారి గురించి మనసులో తలంచినప్పుడు కానీ మన మనస్సు ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దాన్ని స్నేహం అంటాం. మనుషుల మధ్య అన్నింటికన్నా ఉన్నతమైన, ఉత్కృష్టమైన బంధమే స్నేహం. స్నేహబంధం అందరితో సమానంగా ఉండేది, పంచుకొనేది కాదు. ఏ ఒక్కరితో నో అంతులేని అనురాగానికి ప్రతిరూపంగా స్నేహబంధం ఉంటుంది. మానవ సంబంధాల్లో స్నేహబంధమే అత్యుత్తమమైనది.
టి.సుధాకరశర్మ