INDW vs PAKW : మహిళల ఆసియా కప్‌లో భారత స్పిన్నర్లు ధాటికి పాకిస్థాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. శ్రీ చరణి(3-7), ప్రేమా రావత్(3-9)లు తమ మాయాజాలంతో పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. వీరిద్దరి విజృంభణతో టాపార్డర్, మిడిలార్డర్ ప్లేయర్లు ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా 55 పరుగులకే దాయాది జట్టు ఆలౌటైంది.
టీమిండియా చేతిలో ప్రతిసారి కంగుతినే చిరకాల ప్రత్యర్థి కనీసం మోస్తరు లక్ష్యాన్నైనా నిర్దేశిస్తుందనుకుంటే.. మరీ ఘోరంగా చతికిపలడింది. శ్రీ చరణి(3-7), ప్రేమా రావత్(3-9)లు పోటీపడి వికెట్లు తీయగా నలుగురు డకౌటయ్యారు. పేకమేడను తలపించిన పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షవాయ్ జుల్ఫికర్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత మునీబ చేసిన 13 రన్స్ మినహా ఎవరూ రెండంకెల స్కోర్ దాటలేదు. దాంతో.. 18.1 ఓవర్లో 55 పరుగులకే దాయాది జట్టు ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌తో చెత్త రికార్డు మూటగట్టుకుంది ఫాతిమా సనా బృందం.