రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు.. మీరూ తెలుసుకోండి..!
రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు రాబోతున్నాయి. అవి మన జీవితాన్ని కూడా ప్రభావితం చేయనున్నందున వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది

న్యూఢిల్లీ : రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు రాబోతున్నాయి. అవి మన జీవితాన్ని కూడా ప్రభావితం చేయనున్నందున వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జూన్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలో పెద్ద మార్పు ఉండనున్నది. అదేవిధంగా గతంలో కలిసిపోయిన కొన్ని బ్యాంకుల సేవల్లో మార్పు ఉంటుంది. అలాగే, కొన్ని బ్యాంకుల ఐఎఫ్ఎస్సి కోడ్‌లో మార్పు వస్తుంది. మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే.. జూన్ నెల నుంచి కొత్త వెబ్సైట్ అందుబాటులోకి రానున్నదని తెలుసుకోండి.
1. ఎల్పీజీ సిలిండర్ ధర
ఎల్పీజీ సిలిండర్ ధరలు రేపటి నుంచి మార్పునకు లోబడి ఉంటాయి. చమురు కంపెనీలు ఎల్పీజీ రేట్లను ఇకపై 1, 15 తేదీల్లో సమీక్షిస్తాయి. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.809. 14.2 కిలోల సిలిండర్‌తో పాటు 19 కిలోల సిలిండర్ల ధర కూడా మారుతుంది.
2. బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్
రేపటి నుంచి బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు. అయితే వర్తకుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ విధానాన్ని జూన్ 15 వరకు వాయిదా వేశారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ తివారీ అధ్యక్షత వహించే కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గోల్డ్ జ్యువెలరీ హాల్‌మార్కింగ్ నిబంధనలను అమలు చేయడంలో సమస్యలను పరిష్కరిస్తుంది. జూన్ 15 నుంచి మాల్ మార్కింగ్ దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేయనున్నారు.
3. ఆదాయపు పన్ను విభాగానికి కొత్త వెబ్సైట్
ఆదాయపు పన్ను విభాగం జూన్ 7 నుంచి ఐటీఆర్ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నది. జూన్ 1 నుంచి 6 వ తేదీ వరకు ప్రస్తుత వెబ్సైట్లో ఐటీఆర్ సంబంధిత పని ఉండదు. పాత వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in నుంచి డాటాను కొత్త పోర్టల్ www.incometaxgov.in కు తీసుకెళ్లే పనిలో సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ విభాగం ప్రకారం జూన్ 1 నుంచి 6 వరకు ఈ-ఫైలింగ్ సేవ పనిచేయదు.
4. బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కస్టమర్లకు రేపటి నుంచి బ్యాంక్ చెక్ చెల్లింపు నిబంధనలను మార్చనున్నది. వాస్తవానికి బ్యాంక్ పాజిటివ్ పే చెక్ సేవలను ప్రారంభిస్తున్నది. ఇది చెక్ మోసాలను తగ్గిస్తుంది. రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కును ఇస్తే.. కస్టమర్ ఆ వివరాలను బ్యాంకుతో పంచుకున్న తర్వాతనే చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థికవేత్తల అంచనా
ముంబైలో కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగన్
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
వానాకాలం కరోనా వైరస్‌తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

