న్యూఢిల్లీ: భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతమైంది (Chandrayaan 3 success). బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది మంది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.
మరోవైపు భారత్ చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 పట్ల ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిని చూపాయి. రష్యా చేపట్టిన మూన్ మిషన్ లూనా 25 రెండు రోజుల కిందట విఫలమైంది. ఆ దేశ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై కూలిపోయింది. ఈ తరుణంలో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి స్టాఫ్ ల్యాండింగ్ కావడంపట్ల పలు దేశాలు ఆశ్చర్యపోయాయి. చంద్రయాన్ -3 సక్సెస్ పట్ల భారత్కు ప్రధానంగా ఇస్రోకు అభినందనలు తెలిపాయి. కాగా, ఇప్పటి వరకు చంద్రుడిపై దిగిన అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ ఈ ఘనత దక్కించుకున్నది. అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించింది.
#WATCH | ISRO chief S Somanath congratulates his team on the success of the Chandrayaan-3 mission pic.twitter.com/ZD672osVFf
— ANI (@ANI) August 23, 2023