ఘనంగా కల్పన కూతురు చంద్రకళ పెండ్లి
కల్యాణలక్ష్మి పథకానికి ప్రేరణగా నిలిచిన ఆడబిడ్డ కల్పన కుమార్తె లూనావత్ చంద్రకళ పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు వేదమంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో చంద్రకళ- బానోత్ చందర్ ఒకటయ్యారు.
- వివాహ పెద్దగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
- నాడు కల్పన పెండ్లి చేసిన సీఎం కేసీఆర్
- ఆమె కల్యాణమే కల్యాణలక్ష్మికి ప్రేరణ
- నేడు కల్యాణలక్ష్మి అందుకున్న చంద్రకళ
నర్సంపేట/వరంగల్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): కల్యాణలక్ష్మి పథకానికి ప్రేరణగా నిలిచిన ఆడబిడ్డ కల్పన కుమార్తె లూనావత్ చంద్రకళ పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు వేదమంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో చంద్రకళ- బానోత్ చందర్ ఒకటయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పెద్ది స్వప్న పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివాహం జరిపించారు. ఈ వేడుకకు చంద్రకళ-చందర్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు తరలివచ్చి నవదంపతులను ఆశీర్వదించారు. పెండ్లి కాగానే రూ.1,00,116 కల్యాణలక్ష్మి చెక్కును చంద్రకళ అందుకొన్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ జరిపించిన కల్పన పెండ్లి.. కల్యాణలక్ష్మికి ప్రేరణగా నిలిచింది. కల్పన పెండ్లి జరిగే సమయంలో వాళ్ల ఇల్లు కాలి పెండ్లికి తెచ్చిన డబ్బు, బంగారం, బట్టలు ఆహుతయ్యాయి. పెండ్లి ఆగిపోతుందనుకొన్న టైంలో అటుగా వచ్చిన కేసీఆర్.. కల్పన పెండ్లికి సాయం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం అయ్యాక 2014 అక్టోబర్2న కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పది లక్షల మంది ఆడబిడ్డలు లబ్ధి పొందారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

