చండీగఢ్: చేతిలో బిడ్డతో ఒక మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఒక వ్యక్తి దీనిని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. చండీగఢ్‌కు చెందిన ప్రియాంక ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇటీవల సెక్టార్ 29 వద్ద ఉదయం 8 గంటలకు ఆమె రిపోర్ట్ చేయాల్సి ఉన్నది. అయితే వ్యక్తిగత పనుల వల్ల తొలుత ఆమె రాలేకపోయింది. విధులకు హాజరు కావాలని అధికారి చెప్పడంతో తన బిడ్డతో కలిసి అక్కడికి వచ్చి ట్రాఫిక్ విధులు నిర్వహించినట్లు సమాచారం.
మరోవైపు చేతిలో బిడ్డతో ప్రియాంక ట్రాఫిక్ విధులు నిర్వహించడాన్ని గమనించిన ఒక వ్యక్తి మొబైల్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు ఆ మహిళా ట్రాఫిక్ పోలీస్ విధి నిర్వహణను ప్రశంసించారు. బిడ్ల పట్ల తల్లి ప్రేమను కొనియాడారు. మరి కొందరు మాత్రం ఆమె చర్యను తప్పుపట్టారు. ఒకవైపు కరోనా, మరోవైపు కాలుష్యం ఉన్న పరిస్థితుల్లో ఎండలో రోడ్డుపై బిడ్డతో విధులు నిర్వహించడాన్ని ఆక్షేపించారు. పసి బిడ్డలున్న మహిళా ఉద్యోగులకు తగిన సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం, అధికారులపై కొందరు మండిపడ్డారు.
https://www.instagram.com/p/CMFfK6sn15J/?utm_source=ig_web_copy_link