కొండాపూర్, ఆగస్టు 22 : ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు 75వేల లంచం తీసుకుంటూ చందానగర్ పోలీసుస్టేషన్ ఎస్సై బం డెల బాలరాజ్, కానిస్టేబుల్ బీ రాఘవేంద్ర పట్టుబడ్డారు. చార్జిషీట్ విషయంలో ఎస్సై, కానిస్టేబుల్ లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. శనివారం దాడులు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (ఏడబ్ల్యూపీవో) ఆధ్వర్యం లో శనివారం నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్లో 97మంది మాజీ సైనికులు ప్రొ విజనల్గా ఎంపికయ్యారు. ఎయిర్ ఇం డియా, ముత్తూట్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ సంస్థలు ఈ డ్రైవ్లో పాల్గొన్నాయి.