హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు సర్కార్‌లో కలవరం సృష్టించాయి. ఎట్టకేలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో జరిపిన చర్చల్లో శనివారం నాంపల్లిలోని కమిషనరేట్‌లో దాదాపు రెండు గంటలు జరిగిన చర్చల్లో మాసబ్‌ట్యాంక్, రామంతాపూర్, దుర్గాబాయి దేశ్‌ముఖ్, అబ్దుల్లాపూర్‌మెట్, సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు అధికారులు సమాధానాలివ్వలేక దాటవేశారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక సంప్రదించి పరిష్కారం చూపుతామని శ్రీదేవసేన చెప్పినట్టు సమాచారం.