కదం తొక్కిన రిటైర్డ్ ఉద్యోగులు.. బకాయిల కోసం సచివాలయ ముట్టడి
బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోతే.. ఆందోళనలు ఉధృతం చేస్తాం: రిటైర్డ్.. ఎంప్లాయీస్ అసోసియేషన్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఉద్యోగులు కదం తొక్కారు. మార్చి 2024 నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ‘రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ’ ఆధ్వర్యంలో చేపట్టిన సచివాలయ ముట్టడికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 6,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సచివాలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
నిరసనకారులను అడ్డుకునేందుకు ముళ్లకంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షలను ధికరించి ముందుకు సాగేందుకు, సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. కొందరు వృద్ధులు, మహిళలు రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. చివరకు పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని, పోలీసు బస్సులు, వ్యాన్లలో స్థానిక పోలీసుస్టేషన్లకు తరలించారు. అరెస్టుల సమయంలో నూ ఉద్యోగులు ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ పెద్దపెట్టున నినదించారు.
ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం
తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిషరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. సచివాలయ ముట్టడి అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కొంపల్లి భిక్షపతి, సుంకిశాల ప్రభాకర్‌రావు తదితరులు మీడియాతో మాట్లాడుతూ.. తమకు న్యాయంగా రావాల్సిన జీఐఎస్, టీజీఎస్ఐఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, డీఏ తదితర బకాయిలు ఒకొకరికి సగటున రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ప్రభుత్వం వద్ద పేరుకొనిపోయాయని వివరించారు.
బకాయిల చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ విమరణ పొంది రెండున్నరేండ్లు గడుస్తున్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో వైద్య ఖర్చులకు డబ్బుల్లేక ఇప్పటికే 283 మంది పెన్షనర్లు మృత్యువాత పడ్డారని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 25,943 మంది ఉద్యోగులు రిటైర్ కాగా, జీపీఎఫ్, కమ్యూటేషన్ మాత్రమే చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన అల్టిమేటమ్ ముగిసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సచివాలయ ముట్టడికి దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
మృతిచెందిన పెన్షనర్ల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న పూర్తి బకాయిలను వడ్డీ సహా ఏకమొత్తంగా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను ఒకే విడతగా విడుదల చేసేలా జీవో జారీ చేయాలని కోరారు. పోలీసులు అరెస్టులు చేసినా వెనకి తగ్గేది లేదని, ప్రభుత్వం స్పందించి సమస్యను పరిషరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేసి చావో రేవో తేల్చుకుంటామని హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి ప్రతిపక్షాలు, పలు ప్రజాసంఘాలు తమ మద్దతు ప్రకటించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

