వనపర్తి, మార్చి 23 : వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్‌లో ఉన్న కందకాన్ని ఎందరో నాయకులు పనికి రాదని వదిలేశారు. నేడు ఆ స్థలంలోనే అందమైన మోడ్రన్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఆదివారం వస్తే పట్టణంలోని హనుమాన్టెకిడి, గాంధీచౌక్, శంకర్‌గంజ్ ప్రాంతాల్లో రోడ్లపైనే కూరగాయలు, చేపల విక్రయాలు జరిగేవి. దీంతో ప్రయాణికులు అటువైపు నుంచి వెళ్లేందుకు నరకయాతన అనుభవించేవారు. వీధి విక్రయదారుల సమస్యను పరిష్కరించేందుకు సమైక్య పాలనలో ఏ నా యకుడూ పట్టించుకోలేదు. నూతన కూరగాయలు, చేపలు, మటన్ మార్కెట్‌ను నిర్మించాలని నాడు ప్రణాళికా సంఘం ఉ పాధ్యక్షుడి హోదాలో ఉన్న సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అప్పటి కలెక్టర్ శ్వేతామొహంతితో చర్చించి కందకం స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పించారు. ఈ నూతన మోడ్రన్ మార్కెట్ పూర్తయితే వీధి విక్రయదారుల సమస్య పూర్తి స్థాయి లో తీరనున్నది. మున్సిపాలిటీ 14వ ఆర్థిక సంఘం నిధులతో మొదటి విడతలో రూ.1.26 కోట్లతో 25 దుకాణాల నిర్మాణా లు, సీసీరోడ్డు పనులు పూర్తి కాగా.., రెండో విడుతలో రూ.5 కోట్లతో 143 షాపుల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. లాక్డౌన్లో మార్కెట్ స్థలంలో కూరగాయలు విక్రయించారు.
శత్రువులు ఎవరూ లోపలికి రాకుండా రాజుల కాలంలో వనపర్తి పట్టణంలో ఒక పొడవాటి కాలువను ని ర్మించి.. అందులోని నీటిలో మొసలిలను వదిలేవా రు. కాలక్రమేణా ఆ స్థలం ఖాళీ కావడంతో చెత్తాచెదారం నిండిపోయి నిరుపయోగంగా మారింది. అం తేకాకుండా పందులు స్వైర విహారం చేయడంతో ఇండ్లల్లో ఉన్న వారు ఇబ్బందులు పడేవారు. ఈ క్ర మంలో మార్కెట్ నిర్మించేందుకు పూనుకున్నారు. సిద్ధిపేట తరహాలో కందకం స్థలాన్ని మోడ్రన్ మార్కెట్‌గా మార్చేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మార్కెట్‌ను త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కందకంలో మట్టిపూడ్చి పనులు పూర్తి చేశారు. ముందరి భాగంలో షెడ్ల ఏర్పాటు పనులు పూర్తికాగా.. వెనుక భాగంలో షెడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
కందకం స్థలంలో మార్కెట్ నిర్మాణానికి గానూ రూ.6.26 కోట్లతో 168 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూ పొందించారు. కాగా, మొదటి విడుతలో రూ.1.26కోట్లతో 25 షెడ్లు వేశారు. దీంతో కందకానికి ఇరువైపులా ఉన్న ఇండ్లు కూ డా షాపింగ్, మార్కెట్‌కు అనువుగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. కందకం దాదాపు 435 మీటర్ల పొడవు ఉండగా.., మొదటి విడుతలో ఎస్సీ కాలనీ ఏ బ్లాక్ మొదటి 100 మీటర్ల ను పార్కింగ్‌కు వదిలేశారు. అలాగే ఇంకా 100 మీటర్లలో 3 షెడ్లు వేసి అందులో 25 షాపులు నిర్మించారు. రెండో విడుత లో 143 దుకాణాలు నిర్మించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్కెట్ వద్ద ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టాల్స్, పబ్లిక్ టాయిలెట్లు, క్యాంటీన్, సీసీ రోడ్డు, వీధి దీపాల ఏర్పాటు, పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇదిలా ఉండ గా, కొందరు కందకం స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. నిరంజన్‌రెడ్డి సదరు యజమానులతో మాట్లాడి మార్కెట్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. దీంతో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిర్మాణాలు తొలగించారు.
కందకం స్థలంలో మోడ్రన్ మార్కెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రకాల సదుపాయాలు ఉండేలా పనులు చేపడుతున్నాం. ఎందుకూ పనికిరాదన్న స్థలాన్ని అందమైన కూరగాయాలు, మటన్, చేపల విక్రయాల కోసం మోడ్రన్ మార్కెట్‌గా రూపొందిస్తున్నాం.
– గట్టుయాదవ్, మున్సిపల్ చైర్మన్, వనపర్తి
మొదటి విడుతలో భాగంగా 25 దుకాణాలు నిర్మించాం. మున్సిపాలిటీ జీవో ద్వారా రూ.5 కోట్లతో రెండో వి డుతలో 143 దుకాణాల పనులు జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి ప నులు పూర్తి చేస్తాం. వెజ్, నాన్ వెజ్ ఒకటే దగ్గర దొరికేలా మార్కెట్ నిర్మి స్తున్నాం. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
– భాస్కర్, మున్సిపాలిటీ ఏఈ, వనపర్తి