హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 4 : గ్రామీణ జిల్లా క్రికెటర్లు వెలుగులోకి తెచ్చేందుకు జరిగే అండర్-16 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుని ఎంపిక చేసినట్లు వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూడీసీఏ) జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలైన వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాద్ 6 జిల్లాల జట్ల కోసం వంగాలపల్లిలో గల డబ్ల్యూడీసీఏ క్రికెట్ మైదానంలో సెలెక్షన్స్నిర్వహించగా వివిధ జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారుల పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఉత్తమ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 6 జిల్లాల తుది జట్లను సెలక్షన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో అఫ్జల్, పవన్ తుది జట్లని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 5 నుంచి 9 వరకు మొగిలిచర్ల, వంగాలపల్లి క్రికెట్ మైదానాల్లో జరిగే లీగ్ కమ్ నాకౌట్ విధానంలో జరిగే ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ టోర్నమెంట్ కోసం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసి అండర్-16 హెచ్‌సీఏ లీగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్, శంకర్, వివిధ జిల్లాల కోచ్‌లు సందీప్ నేత్ర, రాజ్ కుమార్, మెతుకు కుమార్ పాల్గొన్నారు.