కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్‌పై కేంద్రం దృష్టి
కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్‌పై కేంద్రం దృష్టి | హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకా రెండో డోసు వేయడంపై కేంద్రం దృష్టి సారించింది.

న్యూఢిల్లీ : హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకా రెండో డోసు వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సూచించారు. టీకాల కవరేజీ, కొవిన్ ప్లాట్‌ఫామ్ మరింత ప్రభావంతంగా ఉండేందుకు చేసిన మార్పుల వివరాలను తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా రెండో మోతాదు పంపిణీని వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు, యూటీలు సమర్థవంతమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. అలాగే ప్రత్యేకంగా సెషన్లు ఏర్పాటు చేయడంతో పాటు టైమ్ స్లాట్లు కేటాయించాలని సూచించారు. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. హెల్త్‌కేర్ వర్కర్లలో టీకా ఫస్ట్ డోస్ జాతీయ సగటు 82 శాతం కాగా.. రెండో మోతాదు తీసుకున్న వారి శాతం 56 శాతమే.
పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, అసోం సహా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే వ్యాక్సిన్ కవరేజీ తక్కువగా ఉన్నది. ఫ్రంట్‌లైన్ వర్కర్లలో ఫస్ట్ డోస్ జాతీయ సగటు 85శాతంగా ఉండగా, రెండో మోతాదు శాతం 47శాతమే. 19 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. ఇందులో బిహార్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కొవిన్ పోర్టల్‌లో 12 భాషలు అందుబాటులోకి తీసువచ్చినట్లు పేర్కొంది. మహమ్మారి నుంచి ఆరోగ్య సంరక్షణను పూర్తి స్థాయిలో కాపాడేందుకు టీకా షెడ్యూల్ సకాలంలో పూర్తి చేయడం ముఖ్యమని రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘కొవిషీల్డ్’ గ్యాప్ తగ్గింపు!
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
జమ్మూకాశ్మీర్‌లో అగ్ని ప్రమాదం.. 20 ఇండ్లు దగ్ధం
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

