న్యూఢిల్లీ, జూన్ 11: అధిక మొత్తంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్ అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును మినహాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ మిశ్రమాలు (ఈ22, ఈ25, ఈ27, ఈ30) ఉండాలని పేర్కొంటూ.. కేంద్రం తాజాగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.
వీటి అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును మినహాయిస్తున్నట్టు పేర్కొన్నది. భారత్ ఈ20 (20శాతం ఇథనాల్) కార్యక్రమాన్ని నిర్దేశిత సమయం కన్నా ముందే సాధించింది. ముడి చమురు దిగుమతుల భారాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించటం, దేశీయంగా జీవ ఇంధనాలకు డిమాండ్‌ను పెంచటాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.