న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలకు చెందిన విపక్ష పార్టీలను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి రావాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, సీపీఐ పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఫోన్ చేశారు.