న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో గత 40 రోజులకు పైగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళన శనివారం అధికారికంగా ముగిసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు.
నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. ఒక కోటి నష్టపరిహారం చెల్లించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే ఆందోళనకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఢిల్లీతో పాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను త్వరలోనే ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్‌లోనూ ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేస్తూ, మంగళవారం నాటికి లిఖిత పూర్వక హామీ ఇవ్వనున్నట్లు తెలిపింది. విద్యారంగ సంస్కరణలపై సీజేపీ సమర్పించిన ఐదు డిమాండ్ల చార్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.