Adilabad | ఆదిలాబాద్… జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్( కన్స్ట్రక్షన్ ) జేఆర్ చౌహన్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1. 902 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా 2.05 మిలియన్ యూనిట్ల సరఫరా ఉందన్నారు. రాబోయే రోజుల్లో వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశాలు ఉండడంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మరో 15 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గనుందన్నారు జిల్లాలో విద్యుత్ సరఫరా మెరుగుపరచడంలో భాగంగా 100 కెవీ ట్రాన్స్ ఫార్మార్లు 20 సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్లు 85 ఏర్పాటు చేసినట్లు చెప్పారు . మరో 100 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు.
జిల్లాకు కొత్తగా వారు 33 కేవీ స్టాండ్ బై లైన్లు మంజూరు అయ్యాయని నాలుగు లైన్ల పనులు జరుగుతుండగా, మరో రెండు లైన్ల పనులుటెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. జిల్లాలో ఏడాది కొత్తగా 18 వందల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. వానకాలం నాటికి మరో 1200 ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్తు వినియోగదారులు ఎలాంటి సమస్యలు వచ్చినా 1912 నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలని సూచించారు.