మహదేవ్పూర్ జూన్ 28: జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో సీడీపీఓ ఆర్.రాధిక ఆదేశల మేరకు అమ్మ మాట.. అంగన్వాడీ బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి హాజరై మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బడిబాట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పిల్లలు అంగన్వాడీల్లో స్వేచ్ఛగా నేర్చుకునేందుకు రంగు రంగుల బొమ్మలు, పుస్తకాలు, ఆట వస్తువులు ఉంటాయని తెలిపారు.
పిల్లల అభివృద్ధికి దోహదపడేందుకు ప్రియదర్శిని సిలబస్ ద్వారా విద్యను అందించేందుకు టీచర్లు అందుబాటులో ఉంటారన్నారని పేర్కొన్నారు. తల్లులు, పిల్లలు, బాలింతల నుంచి అంగన్వాడీ ద్వారా అందించే సేవలను వినియోగించుకోవాలన్నారు. రెండేన్నరేళ్ల నుంచి మూడేళ్ల లోపు పిల్లలను అందుబాటులో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో చేర్పించి వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు స్వర స్వతి, సుజాత, నాగలక్ష్మి ఆయాలు పాల్గొన్నారు.