నార్నూర్ : సీసీఐ కొనుగోలు (CCI Centres ) కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖడే ఉత్తమ్ (Chairman, Mukade Uttam ) రైతులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor ) మండల కేంద్రంలోని ఎన్ఆర్ఎన్ఆర్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన పత్తిని తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వం పత్తి పంటకు మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. దళారుల నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు పత్తి విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతును శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోయం మారుతి, సీపీవో నరేష్, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, జిన్నింగ్ డైరెక్టర్ నీలేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాదవ్ కైలాస్, నార్నూర్ సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావు, మాజీ జడ్పీటీసీలు హేమలత బ్రిజ్జిలాల్, రూపావతి జ్ఞానోబా పుష్కర్, నాయకులు కోరల మహేందర్, సుల్తాన్ ఖాన్, జాదవ్ రెడ్డినాయక్, రైతులు పాల్గొన్నారు.